మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో జాక్‌పాట్ కొట్టిన ముగ్గురు ప్రవాసులు...
- November 20, 2022
దుబాయ్: మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో ముగ్గురు ప్రవాసులు చెరో లక్ష దిర్హాములు గెలుచుకున్నారు. ఇందులో భారతీయ మహిళ మేరీ (43)తో పాటు ఇద్దరు ఫిలిప్పీన్స్ వాసులు జెన్నీఫర్ (44), ఎలుటెరియో (40) ఉన్నారు. తాజాగా దుబాయ్‌లో తీసిన డ్రాలో ఈ ముగ్గురు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా మేరీ మాట్లాడుతూ.. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా తాను వరుసగా మహజూజ్ డ్రాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఇక తాను గెలిచిన నగదులో ఎక్కువ భాగం తన కూతురి చదువుల కోసం వినియోగిస్తానని చెప్పారు. అలాగే మరికొంత భాగాన్ని చారిటీకి ఇస్తానన్నారు. తన స్నేహితులకు పార్టీ ఇచ్చి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటానని మేరీ చెప్పుకొచ్చారు. మేరీతో పాటు ఈ డ్రాలో విజేతగా నిలిచిన మిగతా ఇద్దరు ఫిలిప్పీన్ ప్రవాసులు కూడా తాము గెలిచిన నగదులో కొంత భాగాన్ని స్వచ్చంధ సంస్థలకు విరాళంగా ఇస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







