10.53 మిలియన్లు దాటిన సౌదీయేతర కార్మికుల సంఖ్య

- November 22, 2022 , by Maagulf
10.53 మిలియన్లు దాటిన సౌదీయేతర కార్మికుల సంఖ్య

జెడ్డా: 2022 మొదటి అర్ధభాగంలో స్థానిక లేబర్ మార్కెట్‌లో ఉద్యోగం పొందిన సౌదీ పురుషులు, మహిళల మొత్తం సంఖ్య 188,000 దాటింది. ప్రభుత్వ నివేదికల ఆధారంగా.. రోజుకు సగటున 1039 మంది సౌదీలు ఉపాధి మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో ఉపాధి మార్కెట్‌లో పనిచేస్తున్న సౌదీల సంఖ్య దాదాపు 3.64 మిలియన్లకు చేరుకుంది. 2021 చివరి నాటికి ఉన్న లెక్కలతో పోలిస్తే ఈ సంఖ్య 5.45 శాతం పెరిగింది. స్థానిక మార్కెట్‌లో మొత్తం సౌదీ మహిళల సంఖ్య 1.38 మిలియన్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 8.34 శాతం పెరగడం గమనార్హం. 106,000 కంటే ఎక్కువ మంది మహిళలు లేబర్ మార్కెట్‌లోకి ప్రవేశించారు. రోజూ సగటున 585 మంది సౌదీ మహిళలు ఉపాధి పొందుతున్నారని నివేదిక తెలిపింది.  ప్రస్తుత సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 82,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులు లేబర్ మార్కెట్‌లోకి ప్రవేశించడంతో సౌదీ శ్రామిక పురుషుల సంఖ్య 2.26 మిలియన్లకు పెరిగింది. దీంతో వారి ఉపాధి రేటు 3.77 శాతానికి చేరింది.

సౌదీయేతర కార్మికుల సంఖ్య 10 మిలియన్ల కార్మికుల మార్కును అధిగమించి సుమారు 10.53 మిలియన్లకు చేరుకుంది. ఇది 9.76 శాతం పెరిగింది. 2022 మొదటి ఆరు నెలల్లో 936,000 కంటే ఎక్కువ మంది పురుషులు, మహిళలు ప్రవాసులు లేబర్ మార్కెట్‌లోకి ప్రవేశించారు . సౌదీయేతర కార్మికుల సగటు ఆదాయం SR5174గా ఉన్నది. 

ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న సౌదీల సంఖ్య 2.2 మిలియన్లకు చేరుకుందని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రి అహ్మద్ అల్-రాజీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. సౌదీ నిరుద్యోగం 20 ఏళ్లలో కనిష్ట స్థాయి 9.7 శాతంగా నమోదైందని, సౌదీ విజన్ 2030 నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరుద్యోగిత రేటును 7 శాతానికి తగ్గించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com