సౌదీలో 09 రోజుల్లో వింటర్ సీజన్ ప్రారంభం

- November 22, 2022 , by Maagulf
సౌదీలో 09 రోజుల్లో వింటర్ సీజన్ ప్రారంభం

రియాద్: సౌదీలో మరో 09 రోజుల్లో వింటర్ సీజన్ ప్రారంభం అవుతుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ తెలిపారు. దీంతో సౌదీలో ఉత్తర ప్రాంతాలలో చలిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో  మొదటి-సెమిస్టర్ జరిగే సమయానికి వర్షాలు పడే అవకాశం ఉందని ఇంతకుముందు ఎన్సీఎం అంచనా వేసింది. జజాన్, అసిర్, అల్-బహా, మక్కా ప్రాంతాలలో చురుకైన గాలులతోపాటు వడగళ్ల వర్షాలు పడొచ్చని తెలిపింది. దీంతో ఉత్తర, తూర్పు సరిహద్దు ప్రాంతాలు, రియాద్, ఖాసిమ్, హైల్, అల్-జౌఫ్, తబుక్, మదీనాలలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com