‘వారసుడు’ విషయంలో టాలీవుడ్ యవ్వారం అసలేమైనా బాగుందా.?
- November 22, 2022
తమిళ హీరో విజయ్ తెలుగు దర్శకుడితో, తెలుగు ప్రొడ్యూసర్‌తో కలిసి చేస్తున్న సినిమా ‘వారసుడు’. తమిళంలో ‘వారిసు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని రూపొందిస్తుండడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయ్.
సంక్రాంతి బరిలో నిలిచిన రెండు పెద్ద తెలుగు స్ట్రెయిట్ మూవీస్‌తో పోటీగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు ఈ సినిమా కోసం భారీగా ధియేటర్లు లాక్ చేశారనీ తెలుస్తోంది. అయితే, ఈ సినిమా రిలీజ్ విషయంలో టాలీవుడ్ నిర్మాతల మండలి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగా లేదు.
మొదట తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాతే డబ్బింగ్ సినిమాలంటూ ఈ సినిమాని దారుణంగా అవమానిస్తోంది. దీంతో తమిళ నిర్మాతలు టాలీవుడ్‌పై గుస్సా అవుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడిప్పుడే సౌత్, సినిమా, నార్త్ సినిమా.. వేరే భాషా సినిమా అనే తేడా లేకుండా ఇండియన్ సినిమా అంటూ ఏకతాటిపైకి వచ్చింది మొత్తం చిత్ర సీమ. ఈ తరుణంలో టాలీవుడ్ నుంచి ఓ తమిళ సినిమాపై ఇలాంటి రెస్పాన్స్ రావడం ఏమంత బాగాలేదు.. అటూ టాలీవుడ్ సీనియర్ ప్రముఖులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిలికి చిలికి గాలివానగా మొదలైన ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్లనుందో.!
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







