ఒమన్‌లో నవంబర్ 25న ‘సాండ్ రన్నింగ్ రేస్’
- November 23, 2022
ఒమన్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని బిడియాలోని విలాయత్‌లో నవంబర్ 25 నుంచి ప్రతిష్టాత్మకమైన సాండ్ రన్నింగ్ రేస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని హెరిటేజ్, టూరిజం డిపార్ట్మెంట్, క్విక్ ఛాలెంజ్ కంపెనీ సహకారంతో శుక్రవారం(నవంబర్ 25)న బిడియాలో 'సాండ్ రన్నింగ్ రేస్'ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రొఫెషనల్స్ కోసం 10 కి.మీ రేస్, అలాగే ఔత్సాహికులకు 5 కి.మీ రేసులను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. “రేసు ప్రారంభం, ముగింపు బిడియాలోని విలాయత్‌లోని ఎడారి నైట్స్ క్యాంప్‌లో ఉంటుంది. రిజిస్ట్రేషన్, విచారణల కోసం 95222519, 97247557, 99533694 నంబర్లలో సంప్రదించాలి. ”అని హెరిటేజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







