హారర్ సినిమా అభినేత్రి లో తమన్నా..

- April 24, 2016 , by Maagulf
హారర్ సినిమా అభినేత్రి లో తమన్నా..

తన బాహుబలి, ఊపిరి సినిమాల సక్సెస్ తర్వాతమాంచి ఊపు మీదున్న మిల్కీ బ్యూటీ తమన్నా... కామెడీ తో కూడిన హారర్ సినిమా అభినేత్రి లో నటిస్తోంది.తెలుగు, తమిళం. హిందీ భాషల్లో ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, సోనూ సూద్ మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు.వైజాగ్, చెన్నై, మహారాష్ట్రల్లో షూటింగ్ తర్వాత అభినేత్రి మూవీ యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ప్రస్తుతం ఈ సిటీలో నిర్విరామంగా కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా వుమన్ ఓరియెంటెడ్ మూవీ అట. తమన్నా ఇలాంటి రోల్ లో నటించడం ఇదే మొదటిసారి అని, ప్రభుదేవా తో కలిసి అమీ జాక్సన్ ఓ సాంగ్ లో స్టెప్పులేయనుందని తెలుస్తోంది. త్వరలో అభినేత్రి రిలీజ్ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com