సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మకు అభిమానులకు ఆహ్వానం
- November 23, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ ఈనెల 27న జరగబోతుంది.ఈ కర్మ కు అభిమానులకు కూడా ఆహ్వానం అందించాలని మహేష్ చూస్తున్నాడట. హార్ట్ ఎటాక్ తో సూపర్ స్టార్ కృష్ణ గతవారం కన్నుమూసిన సంగతి తెలిసందే. కృష్ణ కన్నుమూశారనే వార్త తెలిసి యావత్ చిత్రసీమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కడసారి ఆయన్ను చూసేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు , అభిమానులు పోటీపడ్డారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
ఇక కృష్ణ పెద్ద కర్మ ఈ ఆదివారం నాడు జె.ఆర్.సి. కన్వెన్షన్ లో జరపబోతున్నారు. ఈ పెద్ద కర్మకి మహేష్ బాబు, అతని చిన్నాన్న ఆదిశేషగిరి రావు రాబోతున్నారు. ఈ పెద్ద కర్మకి అభిమానులను కూడా ఆహ్వానించాలని మహేష్ అనుకున్నట్టుగా సమాచారం. కృష్ణ అంత్యక్రియలు రోజు, చాలామంది అభిమానులు ఎక్కడెక్కడ ఊర్ల నుండో వచ్చి అతన్ని చివరిసారిగా చూసేందుకు పెద్ద సంఖ్యలో పద్మాలయ స్టూడియోస్ కి వచ్చారు. కానీ చాలామంది చూడలేకపోయారు. అందుకని పెద్ద కర్మ రోజున అభిమానులను కూడా ఆహ్వానించాలని మహేష్ భావిస్తున్నాడట. దీనికి సంబదించిన ప్రకటన రానుంది.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







