సుప్రీం కోర్టులో నాలుగు ప్రత్యేక బెంచ్‌లు..
- November 23, 2022
న్యూ ఢిల్లీ: సుప్రీం కోర్టులో నాలుగు కొత్త బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ బుధవారం వెల్లడించారు. వచ్చేవారం నుంచి ఈ ప్రత్యేక బెంచ్‌లు విచారణ ప్రారంభిస్తాయని చెప్పారు. క్రిమినల్ అంశాలు, ప్రత్యక్ష-పరోక్ష పన్నుల అంశాలు, భూఆక్రమణలు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్‌ను ఈ ప్రత్యేక ధర్మాసనాలు విచారిస్తాయని తెలిపారు.
‘‘సుప్రీం కోర్టులో నాలుగు ప్రత్యేక బెంచ్‌లు వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇవి క్రిమినల్ అంశాలు, ప్రత్యక్ష పరోక్ష పన్నులు, భూసేకరణ, వాహన ప్రమాదాల క్లెయిమ్ వంటి అంశాలను విచారిస్తాయి’’ అని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. ఓ కేసుకు సంబంధించి అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది చేసిన అభ్యర్థనపై సీజేఐ స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
సుప్రీంకోర్టు ముందు లిస్టింగ్ కేసుల అంశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చే విషయంపై తాను దృష్టి సారించనున్నట్టు ఆయన తెలిపారు. ఇదే సమయంలో అవసరమైతే లిస్టింగ్ షెడ్యూల్ కంటే ముందుగానే కేసులను విచారణ ముందుకు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశానికి సేవ చేయడమే తన ప్రాధాన్యతని, అది సాంకేతికత లేదా రిజిస్ట్రీ సంస్కరణలు లేదంటే న్యాయపరమైన సంస్కరణలు ఏవైనా కావొచ్చని అన్నారు. భారతదేశ పౌరులందరికీ రక్షణగా ఉంటామని చెప్పారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







