‘కస్టడీ’లో నాగ చైతన్య.! ఎందుకలా ఇరుక్కునట్లు.?
- November 23, 2022
అక్కినేని హీరో నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. చైతూ కెరీర్లో 22వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని యాక్షన్ ఎంటర్టైనింగ్ జోనర్లో రూపొందించబోతున్నారనీ ఫస్ట్‌లుక్ చూస్తేనే అర్ధమవుతోంది.
ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ శివ పాత్రలో కనిపించబోతున్నాడు. తోటి అధికారులే ఆయన్ని గన్నులు చూపించి బంధిస్తున్న ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది. విలక్షణ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
అరవింద్ స్వామి, ప్రియమణి తదితరులు ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ‘సమాజం మారాలంటే ముందుగా నువ్వు మారాలి..’ అనే క్యాప్షన్‌తో ఈ సినిమాకి ‘కస్టడీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
టైటిల్ మరియు క్యాప్షన్.. అలాగే చైతూ లుక్స్.. ఇలా అన్నీ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయ్. తెలుగుతో పాటూ తమిళంలోనూ బైలింగ్వల్ మూవీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. చూడాలి మరి, ‘కస్టడీ’తో చైతూ అభిమానుల్ని కట్టడి చేస్తాడో.! లేదో.!
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







