ఆ కమెడియన్ పై నోరు పారేసుకుంటోన్న నటి.! ఎందుకలాగా.!
- November 23, 2022
కల్పిక.. ఈ పేరుకు కొద్దిగా పరిచయం కావాలండోయ్. తెలుగు తెరపై ఓ నటి పేరు ఈ కల్పిక. ఈ మధ్య సమంత తన అనారోగ్య పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరహా వ్యాధితోనే తానూ బాధపడుతున్నానంటూ ఈ నటి ఆ తర్వాత తెరపైకి వచ్చింది.
అది సరే, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన కల్పికకు సోషల్ మీడియాలో ఓ మోస్తరు ఫాలోయంగ్ వుంది. ఓ మోస్తరు.. కాదులెండి ఓ రేంజ్ ఫాలోయింగే వుంది. హాట్ ఫోటో షూట్లతో ఈ ఫాలోయింగ్ తెచ్చుకుంది కల్పిక.
తాజాగా ఈ నటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అందుకు కారణం, నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడమేనట. తన డ్రస్సింగ్ విషయమై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారంటూ రచ్చకెక్కింది. ఈ రచ్చలో భాగంగా కమెడియన్ అభినవ్ గోమటం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయట పెట్టింది నటి కల్పిక.
అభినవ్ గోమటం, కల్పిక మధ్య గతంలో లవ్ లాంటి ఎఫైర్ వుండేదట. ఓ అవార్డు ఫంక్షన్‌లో తనను చులకన చేసి మాట్లాడినందుకు అభినవ్‌ని దూరం పెట్టేశాననీ కల్పిక చెప్పుకొచ్చింది. అప్పటి నుంచీ ఇద్దరి మధ్యా గొడవలు తలెత్తాయట. అయితే, వాటిని అభినవ్ ఎంత మాత్రమూ పట్టించుకోవడం లేదట.
కానీ, కల్పిక మాత్రం వాటిని హైలైట్ చేస్తూ అభినవ్ పై నోటి కొచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది. అత్యంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. ఎంత చేసినా, కల్పికను అభినవ్ లైట్ తీసుకుంటున్నాడు.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







