బాలయ్యతో అనిల్ రావిపూడి.! థింకింగ్ మార్చాడా.?

- November 23, 2022 , by Maagulf
బాలయ్యతో అనిల్ రావిపూడి.! థింకింగ్ మార్చాడా.?

నందమూరి నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే పలు విషయాల్ని పంచుకున్నాడు అనిల్ రావిపూడి. 
తాజాగా మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపెట్టాడు అనిల్ రావిపూడి. మొదట బాలయ్య బాబుతో తీయబోయే సినిమాని సీరియస్ టోన్‌లో అనుకున్నారట. 
కానీ, అనిల్ రావిపూడికి కలిసొచ్చిన జోనర్ అంటేనే హాస్యం. అది లేకుండా ఎలా.? అని ఆలోచించి, స్కిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేశాడట. సీరియస్‌గా కనిపిస్తూనే బాలయ్యతో పిచ్చ కామెడీ పండించనున్నాడట అనిల్ రావిపూడి. ఈ సినిమాలో బాలయ్య లుక్ డిఫరెంట్‌గా వుండబోతోందని అనిల్ గతంలోనే చెప్పారు.
50 ఏళ్ల వయసున్న వ్యక్తిగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్స్‌తో బాలయ్య ఫ్యాన్స్‌కి మజా ఇవ్వనున్నాడట. ‘పెళ్లి సందడి’ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా నటించబోతోంది. ఇదిలా వుంటే, సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’‌గా బాలయ్య ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com