కువైట్ సిటీబస్ 10 మంది 'గోల్డ్ బార్' విజేతలు వీరే

- November 24, 2022 , by Maagulf
కువైట్ సిటీబస్ 10 మంది \'గోల్డ్ బార్\' విజేతలు వీరే

కువైట్: కువైట్‌లోని ప్రముఖ ప్రజా రవాణా ఆపరేటర్ అయిన సిటీబస్.. తన ఫస్ట్ మంత్లీ 'గోల్డ్ రష్' రాఫెల్ ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన డ్రాలో గెలుపొందిన 10 మంది విజేతలను ప్రకటించింది. విజేతలకు 5 గ్రాముల చొప్పున 24 క్యారెట్ల బంగారు కడ్డీలను బహుమతుల కింద అందజేసింది.

బంగారం గెలిచిన 10 మంది విజేతలు
అభిషేక్ కుమార్, సీన్ మాగ్జిమస్ బౌటిస్టా, తవడ్రస్ హలీమ్ ఫరా, డెన్హామ్ ఆంథోనీ లాబ్రూయ్, సాలీ ఫెర్నాండో కయనన్, క్రిసెల్ తుంబగా, జగదీష్ పాటిదార్, బెన్సీ చక్కలాయిల్ వర్గీ బేబీ, దీపక్ పాండే, ఎడ్గార్ బలియత్‌లు. ఈ 10 మంది విజేతలను సిటీబస్ అభినందించింది. తమ కంపెనీకి మద్దతుగా నిలిచిన కస్టమర్లకు ప్రోత్సాహకంగా సిటీబస్ అక్టోబర్ 14న ‘గోల్డ్ రష్’ రాఫిల్ మంత్లీ డ్రాను ప్రారంభించింది.
ఈ ప్రమోషన్ రాబోయే రెండు నెలల్లో సిటీబస్‌లో ప్రయాణించే ప్రయాణికులందరికీ వర్తిస్తుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రయాణికులు తమ టిక్కెట్లను నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ప్రతి టికెట్ గోల్డ్ బార్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. ఒకే ప్రయాణికుడు ఎన్నైనా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా 10 మంది విజేతలు 5 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ బార్‌ను అందజేస్తారు. రాఫిల్ డ్రా ముగింపులో ఒక మెగా రాఫిల్ విజేతకు 40 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ బార్‌ను అందిస్తారు. ఈ ప్రమోషన్ జనవరి 15 వరకు కొనసాగుతుందని సిటీబస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ ధీరజ్ భరద్వాజ్ తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com