రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మాస్ కా దాస్ ధమ్కీ’.!
- November 24, 2022
వివాదాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశ్వక్సేనుడు. మంచి టాలెంట్ వున్న హీరోనే. కానీ, కాస్త నోటి దురద ఎక్కువ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను మించిన ఆటిట్యూడ్. ఈ ఆటిట్యూడ్‌తోనే ఇటీవల సీనియర్ నటుడు అర్జున్‌తో సినిమాకి లాస్ట్ మినిట్‌లో ఢింకీ కొట్టి వివాదాల్లోకెక్కాడు.
ఇలాంటివి మనోడికి ఒక్కసారి కాదనుకోండి చాలా సార్లే జరిగాయ్ గతంలో. తాజాగా విశ్వక్ సేన్ నటిస్తున్న ‘ధమ్కీ’ చిత్రం ప్రమోషన్లు హోరెత్తుతున్నాయ్. రిలీజ్‌కి ఇంకా చాలా టైమ్ వుండగానే మనోడు హడావిడి గట్టిగా చేసేస్తున్నాడు ఈ సినిమాకి. ఎందుకంటే ఈ సినిమాకి కర్త, కర్మ,క్రియ అన్నీ ఆయనే.
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది. విశ్వక్ సేన్‌కి జోడీగా నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్ట్‌గా సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఫిబ్రవరి 17 న ‘ధమ్కీ’ రిలీజ్ కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇలా వరుసగా సినిమాని ప్రమోట్ చేస్తూనే వున్నాడు విశ్వక్ సేన్. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’ సినిమాలతో ఈ మధ్య విశ్వక్ సేన్ వరుసగా సందడి చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!







