సమంతకు మళ్లీ అనారోగ్యం.! నెట్టింట వైరల్ అవుతున్న ఇష్యూ.!
- November 24, 2022
ఇటీవల ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో ఆసుపత్రిలో చేరిన సమంత, ప్రస్తుతం ఆరోగ్యంగానే వుంది. చికిత్స అనంతరం ఇంట్లోనే వుండి రెస్ట్ తీసుకుంటోంది సమంత.
మరికొద్ది రోజుల్లోనే తాను పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే వర్కవుట్లు కూడా స్టార్ట్ చేసింది సమంత.
ఇదిలా వుంటే, మళ్లీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమంత అంటూ సోషల్ మీడియాలో ఓ గాలి వార్త సడెన్‌గా పుట్టుకొచ్చింది. ఇది గాలి వార్తే అంటూ సమంత మేనేజర్ ఖండించాడు. సమంత ఆరోగ్యంగానే వుంది. ఇంట్లోనే వుంది.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తనకు ‘మయోసైటిస్’ అను వ్యాధి వుందని సమంత చెబితేనే తెలిసింది. వన్స్ ఈ విషయం బయటికొచ్చాకా ఇదే తరహా వ్యాధి.? వస్తే ఏమవుతుంది.? అంటూ ఆరాలు పట్టిన నెటిజన్లు.. ఇంకేముంది.. ఈ వ్యాధి వస్తే చచ్చిపోవడమే.. అంటే సమంత నయం కాని వ్యాధితో బాధపడుతోంది.. కెరీర్‌కి ఇకపై గుడ్ బై చెప్పేయాల్సిందే.. అన్నట్లుగా పుకార్లు పుట్టించేశారు.
నేనింకా చావలేదు. నేను బాగానే వున్నాను.. అంటూ సమంత స్వయంగా బయటికి వచ్చి చెబితే కానీ, ఆ పుకార్లకు చెక్ పడలేదు. ఇప్పుడు మళ్లీ ఇదిగో ఇలాంటి పుకార్లు..! ఏం చేస్తాం.! నెటిజన్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!







