‘కాంతార’ స్వీట్ షాక్.! రాననుకున్నారా.? రాలేననుకున్నారా.?

- November 24, 2022 , by Maagulf
‘కాంతార’ స్వీట్ షాక్.! రాననుకున్నారా.? రాలేననుకున్నారా.?

ఇటీవల ఓ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకున్నదేమైనా వుంది అంటే. అది ‘కాంతార’ సినిమా గురించే. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని విజయం అందుకుంది. 
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా అదేనండీ ప్యాన్ ఇండియా వైడ్ ‘కాంతార’ ప్రశంసలు దక్కించుకుంది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. 
అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఘనమైన లాభాలతో తిరుగులేని విజయం దక్కించుకుంది. హిట్టు సినిమా అయినా, ఫట్ సినిమా అయినా కేవలం వారం రోజులు మాత్రమే ధియేటర్లలో ఆడుతున్న రోజులివి. అలాంటిది, విడుదలయ్యాకా కొన్ని వారాల పాటు ధియేటర్లలో స్టడీగా రన్ అవుతూ రికార్డులు కొల్లగొట్టింది ‘కాంతార’.
ధియేటర్ రన్ రేటు ఆ స్థాయిలో వుండడంతో, ఈ సినిమాని ఇప్పుడప్పుడే ఓటీటీలో వదిలేదు లేదు.. అంటూ నిర్మాతలు నిర్ణయించుకున్నారన్నది ఓ టాక్. దాంతో ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాపై అంతగా ఆశలు పెట్టుకోలేదు. కానీ, సడెన్‌గా ఈ సినిమా గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 
దాంతో, ఓటీటీ‌కి ‘కాంతార’ స్వీట్ షాక్ ఇచ్చినట్లయ్యింది. ఇప్పుడప్పుడే రాదనుకున్న ‘కాంతార’ సడెన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమయ్యేసరికి ఓటీటీ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com