బహ్రెయిన్‌లో అక్రమ పార్కింగ్ పై అధికారుల ఉక్కపాదం!

- November 26, 2022 , by Maagulf
బహ్రెయిన్‌లో అక్రమ పార్కింగ్ పై అధికారుల ఉక్కపాదం!

బహ్రెయిన్: బహ్రెయిన్ వీధుల్లో తరచుగా ట్రాఫిక్ జామ్‌లు అయ్యుంకు నివాసితులు, పౌరుల నిర్లక్ష్యపు పార్కింగ్ ప్రవర్తననే కారణం అని ఇలాంటి చర్యలపై దృష్టి సారించినట్లు బహ్రెయిన్ ట్రాఫిక్ అధికారులు తెలిపారు. కొందరు ఇతర వాహనాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పార్కింగ్ చేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే పార్కింగ్ సౌకర్యం లేని రెస్టారెంట్ల కస్టమర్‌లు ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్నారని, దీంతో ఆయా ఏరియాల్లో భారీగీ ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు కారణం అవుతుందన్నారు. 

సంతోష్ కుమార్ అనే వ్యక్తి తన పార్కింగ్ కష్టాల గురించి వివరిస్తూ.. ఒక రోజు తన పిల్లలతో రెస్టారెంట్ డిన్నర్ చేయాలని అడ్లియాకు వెళ్లామన్నారు. “నేను రెస్టారెంట్ ముందు పార్కింగ్ చేశాను. డిన్నర్ చేయడానికి వెళ్ళాను. తిరిగి వచ్చినప్పుడు, నా కారుకు మరో కారు అడ్డంగా ఉంది. నేను ఆ కారు యజమానిని గుర్తించడానికి తీవ్రంగా ప్రయత్నించాను. ప్రయోజనం లేకపోయింది. రెస్టారెంట్ మేనేజర్‌ని సంప్రదించినా.. ఫలితం లేదు. చివరికి, వాహన యజమాని వచ్చి తన కారును తీసుకెళ్లే వరకు వేచి ఉన్నాను. ఇదంతా జరిగేందుకు 30 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది.’’ అని వాపోయాడు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయకుండా వీధుల్లో పెట్రోలింగ్ ఉండేలా చూడాలని అధికారులను సంతోష్ కోరుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com