జెడ్డాలో 179మి.మీ వర్షపాతం నమోదు.. 2009 రికార్డు బ్రేక్
- November 26, 2022
జెడ్డా: జెడ్డా నగరంలో మునుపెన్నడూ లేనంతగా గురువారం నాడు 179 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వర్షం కురిసిందని పేర్కొంది. దక్షిణ ప్రావిన్స్‌లో 2009లో నమోదైన అతిపెద్ద వర్షపాతం కంటే ఇప్పుడు భారీ వర్షం కురిసిందని తెలిపింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జెడ్డా మున్సిపాలిటీ హెచ్చరికను జారీ చేసింది. వాతావరణ కేంద్రం తువాల్, తీర ప్రాంతాలతో సహా మక్కా ప్రాంతంలోని జెడ్డా, రబీగ్ గవర్నరేట్‌లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు వాతావరణం కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయం ప్రకటించింది. మక్కా మున్సిపాలిటీలో 11,800 మంది ఫీల్డ్ వర్కర్లను వర్షాల సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు సన్నద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మక్కా అంతటా టాస్క్ ఫోర్స్‌లు, అత్యవసర సామగ్రిని మోహరించినట్లు పేర్కొన్నారు. దాదాపు 52 నీటి ట్యాంకులు.. ఒక్కొక్కటి 194,000 గ్యాలన్ల సామర్థ్యంతో వరదనీటిని తొలగించే సామర్థ్యం ఉన్నవాటిని రెడీగా పెట్టామన్నారు. వర్షాల నేపథ్యంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు క్షేత్రస్థాయి బృందాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపాలిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







