టాప్ గేర్ నుండి సిద్ శ్రీరామ్ సాంగ్ విడుదల
- November 26, 2022
హైదరాబాద్: హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆది సాయి కుమార్ వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా ఇప్పుడు టాప్ గేర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశికాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఇక ప్రమోషన్లో భాగంగా సినిమాలోని ‘వెన్నెల వెన్నెల’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని మేకర్స్ విడుదల చేసారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా , సిద్ శ్రీరామ్ ఆలపించారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాట మెలోడీయస్ గా సాగుతూనే యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. సాంగ్ లోని సన్నివేశాలు, మ్యూజిక్ పాటను క్యాచీకగా తయారు చేసాయి.
ఇక ఈ మూవీ లో ఆదికి జోడిగా రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలలో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాకథనాలతో రాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించబోతుందని మేకర్స్ అంటున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







