అఖిల్ ‘ఏజెంట్’ పరిస్థితేంటబ్బా.!
- November 26, 2022
అక్కినేని హీరో అఖిల్‌కి ఎప్పటికప్పుడే అగ్ని పరీక్ష అవుతోంది. తొలి సినిమా నుంచీ హీరోగా నిలదొక్కుకోవడానికి అఖిల్ చాలా చాలా కష్టపడాల్సి వస్తోంది. ప్రతీ సినిమాని విడుదల చేసుకోవడం కత్తి మీద సామే అవుతోంది పాపం అఖిల్‌కి.
తాజా మూవీ ‘ఏజెంట్’ విషయానికి వస్తే, గతేడాది డిశంబర్‌లో రిలీజ్ కావల్సిన సినిమా ఇది. కాలేదు. ఈ ఏడాది ఆగస్ట్‌కి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది అయినా కుదరలేదు. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి పక్కా అన్నారు. కానీ, అది కూడా కుదురుతుందో లేదో అని టాక్.
ఒకవేళ అది కుదరకపోతే ఫిబ్రవరికి ట్రై చేద్దామా.? అంటే ఫిబ్రవరిలోనూ అఖిల్‌కి స్లాట్ దొరకడం లేదంట. ఇలా వాయిదాల పర్వంతో ‘ఏజెంట్’ ఎప్పటికి ధియేటర్లలో సందడి చేస్తుందా.? అని అక్కినేని అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారట.
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. బాలీవుడ్ భామ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. అద్భుతమైన యాక్షన్ ఘట్టాలు, భారీ బడ్జెట్‌తో స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న సినిమా ఇది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







