ట్రావెల్ బ్యాన్ ఆర్డర్ ప్రవాసుల బహిష్కరణకు ఆటంకం కాదు:సౌదీ

- November 30, 2022 , by Maagulf
ట్రావెల్ బ్యాన్ ఆర్డర్ ప్రవాసుల బహిష్కరణకు ఆటంకం కాదు:సౌదీ

రియాద్: జ్యుడీషియల్ ఇంప్లిమెంటేషన్ చట్టంలోని కొత్త సవరణ ప్రకారం.. ప్రవాస కార్మికుడిపై జారీ చేసిన ప్రయాణ నిషేధ ఉత్తర్వు అతని బహిష్కరణకు సంబంధించిన ఆర్డర్‌ను అమలు చేయడానికి అడ్డంకి కాదని సౌదీ అరేబియా ప్రకటించింది. దీనికి సంబంధించి చట్టంలోని ఆర్టికల్ 46ను సవరించినట్లు పేర్కొంది. సవరణకు ముందు, చట్టంలోని ఆర్టికల్ 46 ప్రకారం.. దివాలా తీసిన వ్యక్తి రుణం చెల్లించాలనే ఉత్తర్వును అమలు చేయడంలో విఫలమైతే లేదా ఆ తేదీ నుండి ఐదు రోజుల వ్యవధిలో రుణాన్ని చెల్లించడానికి తగినంత నిధులు తన వద్ద ఉన్న విషయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిపై విధించిన ప్రయాణ నిషేధం ఎత్తివేయబడే వరకు బహిష్కరణ నిర్ణయం నిలిపివేయబడుతుంది. ఇది సాధారణంగా వ్యక్తి డిఫాల్ట్ మొత్తాన్ని చెల్లించిన తర్వాత మాత్రమే జరుగుతుందని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com