శ్రద్ధాను చంపినందుకు బాధపడట్లేదు: ఆఫ్తాబ్ ఆమిన్
- November 30, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ ఆమిన్ పూనావాలా కీలక విషయాలు వెల్లడించాడు. ఈ పరీక్షలో శ్రద్ధాను హత్య చేసినట్లుగా అంగీకరించిన ఆఫ్తాబ్..ఆమెను చంపినందుకు తనకు పశ్చాత్తాపం లేదని వెల్లడించినట్టుగా విచారణ బృందం వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా తనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని అంగీకరించినట్లు చెప్పాయి. పాలిగ్రాఫ్ పరీక్షలో ఆఫ్తాబ్ ప్రవర్తన చాలా సాధరణంగా ఉన్నట్టుగా వెల్లడించాయి. ఈ టెస్టుకు సంబంధించి తుది నివేదిక ఇంకా రాలేదు.
రేపు ఆఫ్తాబ్ కు నార్కో పరీక్ష జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అతడికి నార్కో టెస్టు జరిపేందుకు ఇప్పటికే కోర్టు పర్మిషన్ తీసుకన్న పోలీసులు.. డిసెంబరు 1, 5 తేదీల్లో టెస్టులు నిర్వహించనున్నారు. ఇక ఈ కేసులో శ్రద్ధా డీఎన్ఏ పరీక్షకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. నివేదికలు వస్తేనే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. 28 ఏళ్ల ఆఫ్తాబ్ .. తన ప్రియురాలైన శ్రద్ధా వాకర్ ను హత్య చేసి 35 ముక్కలుగా చేశాడు. అనంతరం రాత్రి పూట ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాటిని విసిరెస్తూ వచ్చాడు. శ్రద్ధా బతికే ఉన్నట్టుగా అందర్ని నమ్మిస్తూ వచ్చాడు. అయితే బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నవంబర్ 12న ఆఫ్తాబ్ ను ఆరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







