జెడ్డా, రబీగ్‌లో మళ్లీ కుండపోత వర్షాలు!

- November 30, 2022 , by Maagulf
జెడ్డా, రబీగ్‌లో మళ్లీ కుండపోత వర్షాలు!

జెడ్డా: జెడ్డా, రబీగ్ గవర్నరేట్‌లలో మళ్లీ కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరించింది. ముఖ్యంగా తీర ప్రాంతాలలో గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ఎన్సీఎం తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉపరితల గాలులు, వడగళ్ళు, కుండపోత వర్షాలు పడతాయని పేర్కొంది. హైవేలపై దృశ్యమానత తగ్గుతుందని పేర్కొంది. మరోవైపు మక్కా ప్రాంతంలో ప్రజలు వర్షం సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. ముఖ్యంగా నీటితో ఉన్న చిత్తడినేలలు, జలపాతాలకు దూరంగా ఉండడం, వర్షం సమయంలో లోయలు దాటే సహసాలను చేయొద్దని హెచ్చరించింది.
గత గురువారం జెడ్డాలో రికార్డు స్థాయిలో179.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరిగ్గా 13 ఏళ్ల క్రితం నగరాన్ని అతలాకుతలం చేసిన విధ్వంసకర వరదల దిగ్భ్రాంతికరమైన జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది. తాజా వరదలలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. నీట మునిగిన వాహనాల్లో చిక్కుకున్న పలువురిని అధికారులు రక్షించారు. నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. కొన్ని గంటలపాటు విమానాలు, రోడ్డు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జెడ్డా నివాస పరిసరాల్లోని అనేక వీధులు జలమయమయ్యాయి. దీనివల్ల చాలా వాహనాలు దెబ్బతిన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com