అంతర్జాతీయ స్కూల్ గేమ్స్ కోసం సిద్ధమైన బహ్రెయిన్

- December 01, 2022 , by Maagulf
అంతర్జాతీయ స్కూల్ గేమ్స్ కోసం సిద్ధమైన బహ్రెయిన్

బహ్రెయిన్: హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్కూల్ గేమ్స్ (బహ్రెయిన్ 2024) నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. డిసెంబరులో ది ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISF) గేమ్స్ సన్నాహాలను చర్చించడానికి బహ్రెయిన్ 2024 ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇషాక్ అబ్దుల్లా ఇషాక్ అధ్యక్షతన ఒక సమావేశాన్ని నిర్వహించింది.

ఇంటర్నేషనల్ స్కూల్ గేమ్స్ (బహ్రెయిన్ 2024) లో ప్రపంచం నలుమూలల నుండి 80 కంటే ఎక్కువ దేశాల నుండి ఐదు వేల మంది విద్యార్థులు 25 క్రీడలలో పోటీ పడతారని భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ గేమ్స్ ని నిర్వహించడానికి ఆర్గనైజింగ్ కమిటీ 14 సైట్‌లను కేటాయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com