యాదగిరిగుట్టలో 100 పడకల ప్రభుత్వ హాస్పటల్ మంజూరు
- December 01, 2022
హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో 100 పడకల ఆసుపత్రికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తూ వైద్యా విధాన పరిషత్ ఈరోజు(బుధవారం) జీవోను జారీ చేసింది.ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి రూ. 45 కోట్ల 79 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.ఇప్పటికే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం మహాద్భుతంగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే.
ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి నిధులు కేటాయించారు. ఇక ఇప్పుడు యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తున్నారు. దీంతో పాటు ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా 13 ప్రాథమిక ఉప కేంద్రాలను మంజూరు చేసింది ప్రభుత్వం. ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి రూ. 20 లక్షలు కేటాయించారు. ఆరు పడకల యాదాద్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తూ జీవో నంబర్ 722 ద్వారా ఉత్తర్వులు విడుదల చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!
- ఆసియాకప్ ట్రోఫీని తీసుకెళ్లిన నఖ్వీ..
- బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!