సౌదీలో తూర్పు ప్రావిన్స్‌లో రెండు సహజ వాయువు క్షేత్రాల గుర్తింపు
- December 01, 2022
రియాద్: సౌదీ అరేబియాలో తూర్పు ప్రావిన్స్‌లో రెండు సహజ వాయువు క్షేత్రాలను కనుగొన్నట్లు ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ప్రకటించారు. సౌదీ అరామ్కో తూర్పు ప్రావిన్స్‌లో రెండు సంప్రదాయేతర సహజ వాయువు క్షేత్రాలను కనుగొన్నదని పేర్కొంది. హోఫుఫ్ నగరానికి నైరుతి దిశలో 142 కిలోమీటర్ల దూరంలో ఘవార్ క్షేత్రానికి నైరుతి దిశలో 'అవ్తాద్' సంప్రదాయేతర సహజ వాయువు క్షేత్రాన్ని గుర్తించారు. దహ్రాన్ నగరానికి నైరుతి దిశలో 230 కిలోమీటర్ల దూరంలో 'అల్-దహ్నా' సంప్రదాయేతర సహజ వాయువు క్షేత్రాన్ని గుర్తించినట్లు తెలిపారు. సౌదీ అరేబియాలో చమురు కార్యకలాపాలు ఏడాది క్రితం 9.3 శాతం నుంచి 14.5 శాతం పెరిగాయని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!
- ఆసియాకప్ ట్రోఫీని తీసుకెళ్లిన నఖ్వీ..
- బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!