దక్షిణ ఇరాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం: యూఏఈలోనూ ప్రకంపనలు!
- December 01, 2022
యూఏఈ: యూఏఈ కాలమానం ప్రకారం రాత్రి 7.17 గంటలకు దక్షిణ ఇరాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్‌సీఎం) తెలిపింది. అయితే భూకంప ప్రభావం యూఏఈలో తక్కువగా ఉంటుందని ప్రకటించింది. కాగా దుబాయ్‌లోని అనేక మంది నివాసితులు భూకంప ప్రకంపనలు అనుభవించినట్లు ట్వీట్‌ల ద్వారా వెల్లడించారు. @joshdoit8 హ్యాండిల్‌ని ఉపయోగించే ఒక నెటిజన్.. "మా ఇంట్లో లైట్లు కదిలాయి. దుబాయ్‌లో తనకు ఇది రెండవ భూకంప ప్రకంపనల అనుభవం." అని తన అనుభవాలను వివరించారు. మరో ట్విట్టర్ యూజర్ పీయూష్ భదానీ నవంబర్ 30న రాత్రి దుబాయ్‌లో చాలా సమయం పాటు భూకంప ప్రకంపనలు వచ్చాయి." అని పేర్కొన్నారు. @ashshanuferns అనే ట్విట్టర్ యూజర్.. "భుకంపం వచ్చినట్లు నాకు ఇప్పుడే తెలిసింది. 5 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి." అని తన పోస్టులో రాసుకొచ్చారు.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!