దుబాయ్-దోహా డైలీ 6800 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణం...
- December 01, 2022
దుబాయ్: ఫిఫా వరల్డ్ కప్ కోసం దాదాపు దశాబ్దకాలం పాటు కష్టపడి, భారీ బడ్జెట్‌తో మైదానాలను ఖతార్ రెడీ చేసింది.ఈ క్రీడా నిర్వహణలో ఇప్పటికే ప్రత్యేకతను చాటుకున్న ఖతార్.. ప్రపంచమంతా తమవైపు తిరిగి చూసేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అభిమానులపై కొన్ని ఆంక్షలు విధించనప్పటికీ మ్యాచులకు భారీ సంఖ్యలోనే ప్రేక్షకులు హాజరవుతున్నారు.ఈ క్రమంలో దుబాయ్, ఖతార్ మధ్య డైలీ ప్రయాణాలు భారీగా పెరిగాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రతిరోజు 6,800 మందికి పైగా రాకపోకలు కొనసాగిస్తున్నారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రి వెల్లడించారు. ఇక దుబాయ్ విమానాశ్రయంలో ఫుట్‌బాల్ లవర్స్ ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హమద్, దోహా ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టులకు డైలీ వెళ్లే సాధారణ విమాన సర్వీసులు కాకుండా మ్యాచులు ఉండే రోజుల్లో 100కు పైగా స్పెషల్ సర్వీసులు నడిపిస్తున్నట్లు అల్ మర్రి చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!