ఆన్లైన్ ద్వారా రెసిడెన్సీ వీసా రెన్యువల్ చేసుకోవచ్చు..
- December 01, 2022
యూఏఈ: యూఏఈలోని నివాసితులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఒక్క వీసానే కాదు, ఎమిరటీ ఐడీని కూడా ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే రెన్యువ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ రెండు సర్వీసులు ఇప్పుడు యూఏఈలో విలీనం చేయబడ్డాయి. అందుకే ఇంట్లో కుర్చొనే వీటిని మనం పొందవచ్చు.ఇక ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ.. అబుదాబి, షార్జా, అజ్మాన్, రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ క్వైన్, ఫుజైరా ఎమిరేట్స్‌లో వీసా సంబంధిత సమస్యలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దరఖాస్తుదారులకు సంబంధిత ప్రక్రియ గురించి అవగాహన కల్పిస్తోంది. వారి వీసా, ఎమిరటీ ఐడీ రెండింటి పునరుద్ధరణను పూర్తి చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని వివరిస్తుంది. ఈ నేపథ్యంలో ఐసీపీ నవంబర్ 28న ఒక ప్రకటన చేసింది. రెన్యువల్ దరఖాస్తు అనేది అధికారిక వెబ్సైట్ http://www.icp.gov.aeలేదా స్మార్ట్‌ఫోన్ యాప్ ‘UAEICP’ ద్వారా చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉందని ఐసీపీ వెల్లడించింది.
ఆన్లైన్ ద్వారా చేసుకునే విధానం...
1: వెబ్సైట్ లేదా యాప్‌లో రిజిస్టర్ అయిన తర్వాత ఆ లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి.
2: రెసిడెన్స్ పర్మిట్ అండ్ ఎమిరేట్స్ ఐడీ రెన్యువల్ సర్వీస్ ఎంచుకోవాలి.
3: ఆ తర్వాత మన వివరాలు అప్డేట్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. అనంతరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
4: ఎమిరటీ ఐడీ రెన్యువ్ కోసం కూడా ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి.
తాజా వార్తలు
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్‌లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం