మెగా మేనల్లుడు రంగంలోకి దూకేశాడుగా.!
- December 01, 2022
ఎపుడూ యాక్టివ్‌గా హుషారుగా కనిపించే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత జోరు బాగా తగ్గించేశాడు.దాదాపు ఏడాది తర్వాత కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు.
సినిమా టైటిల్ వివరాలు ఇంకా తెలీదు కానీ, కార్తీక్ అను కొత్త దర్శకుడితో ఓ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాకి సంబంధించి ఇంతకన్నా వివరాలేమీ బయటికి రాలేదింతవరకూ.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్లు ప్రకటించారు. ఎన్టీయార్ చేతుల మీదుగా ఈ టీజర్ డిశంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో తేజుకి జోడీగా నటిస్తోంది.
‘రిపబ్లిక్’ సినిమా రిలీజ్‌కి ముందు తేజ్ బైక్ యాక్సిడెంట్‌కి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా కాలం పాటూ తేజ్ మీడియా ముందుకు రాలేదు.
తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో లాంగ్ గ్యాప్ తర్వాత మీడియా ముందుకొచ్చాడు తేజ్.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!