‘యుగాంతం’.! కార్తికేయుడి కొత్త ప్రయోగం.!
- December 01, 2022
2012లో యుగాంతం అయిపోతుందని అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది.ఆ ప్రచారాన్ని బేస్ చేసుకుని, హాలీవుడ్‌లో ‘2012’ టైటిల్‌తో ఓ సినిమా కూడా తెరకెక్కింది.ఆ సంవత్సరం ప్రపంచం మొత్తం ప్యానిక్‌లో మునిగిపోయింది.
ఎలాగోలా గట్టెక్కేశాం.ఆ ఏడాది యుగాంతం కాలేదు. కానీ, ఆ నేపథ్యంలో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది.
అయితే, అది హాలీవుడ్ ముచ్చట. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌తో ‘బెదురులంక 2012’ అనే టైటిల్‌తో యంగ్ హీరో కార్తికేయ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాని కాస్త ఫన్ టోన్‌లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
క్లాక్స్ అనే కొత్త డైరెక్టర్ చేస్తున్న ప్రయోగమిది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన కార్తికేయ, కేవలం హీరోగానే కాకుండా, విలక్షణ నటుడిగా సత్తా చాటాడు. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’ సినిమా కోసం విలన్ అవతారమెత్తాడు.
మంచి విషయమున్న హీరోనే. కానీ, కథల ఎంపికలో తప్పటడుగులు వేస్తున్నాడు. దాంతో రేస్‌లో వెనకబడిపోయాడు. చూడాలి మరి, ఈ సరికొత్త ప్రయోగాత్మకం చిత్రంతోనైనా కార్తికేయుడు బౌన్స్ బ్యాక్ అవుతాడేమో.
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్