అరుదైన పురస్కారం దక్కించుకున్న మెగా పవర్ స్టార్.! ‘మగధీరుడే’.!
- December 03, 2022
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఏదో అలా అలా ప్యాన్ ఇండియా ట్యాగ్ తగిలించుకోవడం కాదు. అసలు సిసలు ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
ఇండియాలోనే కాదు, దేశ విదేశాల్లో రామ్ చరణ్ పాపులర్ ఫిగర్ అనిపించుకుంటున్నాడు. ఈ మధ్య విదేశీ ఈవెంట్లకు బాగా అటెండ్ అవుతూ దేశ విదేశా మీడియాల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే ప్రముఖ జాతీయ మీడియా NDTV, రామ్ చరణ్‌కి అరుదైన గౌరవ పురస్కారంతో సత్కరించింది. ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డు చరణ్‌కి దక్కింది. ఈ గౌరవ పురస్కారం అందుకోవడానికి చరణ్ ఢిల్లీ వెళ్లారు.
తండ్రిని మించిన తనయుడు అంటే అందుకు ఉదాహరణగా చరణ్‌ని చూపించొచ్చు.. అంటే అతిశయోక్తి అనిపించదేమో. తన కొడుకు ఇంత అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నందుకు చిరంజీవి ఆనందానికి అవధుల్లేవు. చరణ్‌కి ఇంత గొప్ప గౌరవం దక్కినందుకు పట్టరాని సంతోషంలో వున్నానంటూ, చాలా గర్వంగా వుందంటూ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా చరణ్‌కి తన ఆశీస్సులు తెలియచేశారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







