భారత్ నుంచి థాయ్‌ల్యాండ్ 'ఈ-వీసా ఆన్ అరైవల్' కోసం పెరిగిన దరఖాస్తులు
- December 03, 2022
భారత్ నుంచి థాయ్‌ల్యాండ్ 'ఈ-వీసా ఆన్ అరైవల్' కోసం ఈ ఏడాది దరఖాస్తులు దాదాపు 7రేట్లు పెరిగినట్లు వీసా ఔట్సోర్సింగ్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ స్పెషలిస్ట్ వీఎఫ్ఎస్ గ్లోబల్ గురువారం వెల్లడించింది. ముఖ్యంగా మార్చి నుంచి అక్టోబర్ మధ్య దరఖాస్తులు భారీగా వచ్చాయని తెలిపింది. ఇది 2022 చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని వీఎఫ్ఎస్ గ్లోబల్ తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ ఏడాది మార్చిలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా దాదాపు రెండేళ్లు ఆగిపోయిన ఇంటర్నెషనల్ విమాన సర్వీసులు మార్చిలో ప్రారంభం కావడం, అప్పటికే చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలగించడంతో మనోళ్లు విదేశాలకు విహారయాత్రలు, ఇతర పనుల కోసం క్యూకట్టారు. ఈ క్రమంలోనే థాయ్‌ల్యాండ్ ఈ-వీసా ఆన్ అరైవల్‌కు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. అది కూడా గతేడాదితో పోలిస్తే ఏడు రేట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఇదిలాఉంటే.. వీఎఫ్ఎస్ గ్లోబల్ 2019లో ఇమ్మిగ్రేషన్ బ్యూరో ఆఫ్ థాయ్‌ల్యాండ్ భాగస్వామ్యంతో ఈ-వీసా ఆన్ అరైవల్ సర్వీసులను ప్రారంభించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







