తీహార్ జైలులో తోటి ఖైదీలతో చెస్ ఆడుతున్న ఆఫ్తాబ్
- December 03, 2022
న్యూఢిల్లీ: తన జీవిత సహచరి శ్రద్ధావాకర్‌ను అత్యంత దారుణంగా హత్య చేసి ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తీహార్ జైలులో తన తోటి ఖైదీలతో చెస్ ఆడుతూ గడుపుతున్నాడని జైలు అధికారులు చెప్పారు. తీహార్ జైలులోని 4వ నంబర్ సెల్ లో ఉన్న ఆఫ్తాబ్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉంటున్నాడు.
దొంగతనం కేసుల్లో జైలుకు వచ్చిన ఇద్దరు ఖైదీలతో కలిసి ఆఫ్తాబ్ చెస్ ఆడుతున్నాడని జైలు అధికారులు చెప్పారు. ఆఫ్తాబ్ కు పాలీగ్రాఫ్, నార్కో అనాల్ సిస్ పరీక్షలు ముగియడంతో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. ఆఫ్తాబ్ విధేయతపై ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
పాలిగ్రాఫ్, నార్కో పరీక్ష సమయంలో అధికారుల సూచనలన్నింటినీ ఆఫ్తాబ్ పాటించాడని పోలీసులు చెప్పారు. ఆఫ్తాబ్ కేవలం ఇద్దరు ఖైదీలతోనే మాట్లాడుతున్నాడని జైలు అధికారులు వివరించారు.శ్రద్ధావాకర్ అదృశ్యానికి సంబంధించి విచారణకు పిలిచినప్పుడు మహారాష్ట్ర పోలీసులను ఆఫ్తాబ్ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. మే నెలలో శ్రద్ధ తన ఛతర్‌పూర్ ఫ్లాట్‌ను విడిచివెళ్లిందని, ఆమె తనతో టచ్‌లో లేదని చెప్పాడు. అనంతరం ఢిల్లీ పోలీసుల ముందు ఆఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించాడు. శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రీజర్‌లో ఎలా భద్రపరిచాడో వివరాలను వెల్లడించాడు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







