AFC మహిళల ఆసియా కప్ 2026కి ఆతిథ్యం: బిడ్ వేసిన సౌదీ అరేబియా
- December 03, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) అధికారికంగా ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC) మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి తన బిడ్‌ను సమర్పించింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని AFC ప్రధాన కార్యాలయంలో సౌదీ ప్రతినిధి బృందానికి ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ ఆసియా కప్ హోస్టింగ్ ఫైల్ డైరెక్టర్ స్వాగతం పలికారు. సౌదీ మహిళా ఫుట్‌బాల్ జట్టు మొదటి అసిస్టెంట్ కోచ్ డోనా రజబ్, సౌదీ జాతీయ జట్టు సభ్యుడు రఘద్ హెల్మీ, యువ క్రీడాకారిణి మరియా బఘాఫర్ కాన్ఫెడరేషన్కు బిడ్‌ను అందజేశారు. SAFF డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడు యాసర్ అల్-మిషాల్ మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడం వల్ల సౌదీలో మహిళల ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతుందన్నారు. జోర్డాన్, ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్తాన్లతో టోర్నమెంట్‌ను నిర్వహించడానికి సౌదీ అరేబియాతో పోటీపడుతున్నాయి.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







