యునెస్కో కింగ్ హమద్ ICT ప్రైజ్: జనవరి 23 వరకు నామినేషన్లు స్వీకరణ

- December 03, 2022 , by Maagulf
యునెస్కో కింగ్ హమద్ ICT ప్రైజ్: జనవరి 23 వరకు నామినేషన్లు స్వీకరణ

బహ్రెయిన్: విద్యలో ICTని ఉపయోగించడం కోసం UNESCO కింగ్ హమద్ బిన్ ఇసా అల్-ఖలీఫా ప్రైజ్ 2022 ఎడిషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారం.. 2023 జనవరి 23 అర్ధరాత్రి వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మార్చి 2023లో అంతర్జాతీయ జ్యూరీ సమావేశం తర్వాత విజేతలను సన్మానించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ లేదా మే 2023లో పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడుతుంది.

బహ్రెయిన్ మద్దతుతో 2005లో స్థాపించబడిన ఈ బహుమతి కింద అత్యుత్తమ ప్రాజెక్ట్‌లను అమలు చేసినందుకు, సృజనాత్మకతను ప్రోత్సహించినందుకు వ్యక్తులు, సంస్థలకు రివార్డ్‌లను అందిస్తుంది. డిజిటల్ యుగంలో అభ్యాసం, బోధన, మొత్తం విద్యా పనితీరును మెరుగుపరచడానికి సాంకేతికతలను ఉపయోగించడాన్ని అవార్డు ఎంపికకు పరిగణనలోకి తీసకుంటారు. అంతర్జాతీయ జ్యూరీ ఏటా రెండు ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేస్తుంది. విజేతకు US$ 25,000, పతకం, డిప్లొమా అందజేస్తారు. ప్రతి సంవత్సరం బహుమతికి ఒక నిర్దిష్ట థీమ్ ఉంటుంది. 2022లో "ది యూజ్ ఆఫ్ పబ్లిక్ ప్లాట్‌ఫారమ్స్ టూ ఎన్ష్యూర్ ఇంక్లూసివ్ టూ డిజిటల్ ఎడ్యుకేషన్ కంటెంట్‌’’ అనే థీమ్ ను ఎంపిక చేశారు.

ఈ సంవత్సరం అవార్డు కోసం ఏర్పాటైన జ్యూరీలో ఎథెల్ ఆగ్నెస్ పాస్కువా-వాలెంజులా (ఫిలిప్పీన్స్), ఇబ్రహీమా గుయింబా-సైడౌ (నైజర్), డాక్టర్ ఇంగే మోలెనార్ (నెదర్లాండ్స్), జవహెర్ AI-ముధాకి (బహ్రెయిన్) మరియు వెర్నర్ వెస్టర్‌మాన్ (చిలీ) ఉన్నారు. కనీసం ఒక సంవత్సరం పాటు కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు మాత్రమే అవార్డులకోసం పరిగణనలోకి తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com