ఫిఫా ప్రపంచ కప్: నాకౌట్ దశ ప్రారంభం, డిసెంబర్ 18న ఫైనల్

- December 04, 2022 , by Maagulf
ఫిఫా ప్రపంచ కప్: నాకౌట్ దశ ప్రారంభం, డిసెంబర్ 18న ఫైనల్

యూఏఈ: ఫిఫా ప్రపంచ కప్ 2022 నాకౌట్ దశకు చేరుకున్నది. ఖతార్‌లో జరిగే టోర్నమెంట్‌లో రౌండ్ ఆఫ్ 16లో మ్యాచులు ప్రారంభమయ్యాయి. నాకౌట్ దశలలో జట్లు ఒకదానికొకటి తలపడతాయి. గెలిచిన జట్టు తదుపరి రౌండ్‌కు వెళుతుంది. రౌండ్ ఆఫ్ 16, క్వార్టర్-ఫైనల్, సెమీ-ఫైనల్, ఫైనల్ దశలు ఇంకా మిగిలి ఉన్నాయి. ప్రపంచ కప్ ఫైనల్ డిసెంబర్ 18న జరుగుతుంది. సెమీ-ఫైనల్‌లో ఓడిన జట్ల మధ్య మూడో ప్లేస్ కోసం ప్లేఆఫ్ మ్యాచ్ ఉంటుంది.

రౌండ్ ఆఫ్ 16కి అర్హత పొందిన జట్లు

గ్రూప్ ఎ:

నెదర్లాండ్స్, సెనెగల్

గ్రూప్ బి:

ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్

గ్రూప్ సి:

అర్జెంటీనా, పోలాండ్

గ్రూప్ డి:

ఫ్రాన్స్, ఆస్ట్రేలియా

గ్రూప్ E:

జపాన్,  స్పెయిన్

గ్రూప్ ఎఫ్:

మొరాకో,  క్రొయేషియా

గ్రూప్ G:

బ్రెజిల్,  స్విట్జర్లాండ్  

గ్రూప్ హెచ్:

పోర్చుగల్, దక్షిణ కొరియా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com