Dhs30 మిలియన్ గెలుచున్న భారత వ్యక్తి..
- December 05, 2022
అబుధాబి: అబుధాబి బిగ్ టికెట్ ర్యాఫిల్ లో భారత వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. శనివారం సాయంత్రం అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తీసిన లాటరీ డ్రాలో షార్జాలో ఉండే భారత ప్రవాసుడు ఏకంగా 30 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.తీరా లాటరీ నిర్వాహకులు అతనికి కాల్ చేసి ఈ విషయం చెబుదామనుకుంటే ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందట.వివరాల్లోకి వెళ్తే.. షార్జాలో ఉండే భారత ప్రవాసుడు కథార్ హుస్సేన్ నవంబర్ 6వ తేదీన 246 సిరీస్‌లో 206975 నంబర్ గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్ ద్వారా కొన్నాడు.ఇంకో విషయం ఏంటంటే 2 టికెట్లు కొంటే.. ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ సందర్భంగా కథార్ ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.
ఇక్కడే అతనికి అదృష్టం కలిసొచ్చింది.కథార్‌కి ఫ్రీగా వచ్చిన టికెట్‌కే (నం.206975) ఈ జాక్‌పాట్ తగలడం విశేషం.ఇక డ్రాలో విజేతగా నిలిచిన భారతీయుడికి షో హోస్ట్ రిచర్డ్ ఫోన్ చేశారు.కానీ, ఆ సమయంలో అతడి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దాంతో ఇతర మార్గాల్లో కథార్‌కి ఈ విషయాన్ని చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







