గుజరాత్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం
- December 05, 2022
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో 14 రాష్ట్రాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2.5 కోట్ల మంది ఓటర్లు.. 833 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. రాష్ట్రంలో అధికార బిజెపి ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఇక ఈ విడతలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ మొత్తం 93 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 90, దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రెండు స్థానాల్లో బరిలోకి దిగాయి. గుజరాత్లో తొలి విడత ఎన్నికలు ఈ నెల 1న జరిగాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ కోసం మొత్తం 26,409 పోలింగ్ స్టేషన్లను, దాదాపు 36 వేల ఈవీఎంలను ఏర్పాటు చేశారు. వీటిలో 93 మోడల్ పోలింగ్ స్టేషన్లు, 93 ఎకో ఫ్రెండ్లీ బూత్‌లు ఉన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







