యూఏఈ మిల్లే మిగ్లియా కార్ ర్యాలీలో అరుదైన కార్లు ఇవే
- December 05, 2022
యూఏఈ: మిల్లే మిగ్లియాను గెలుచుకోవాలనే ఆశతో ప్రపంచంలోని కొన్ని అరుదైన, అత్యంత ప్రత్యేకమైన కార్లు యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌లో ర్యాలీకి సిద్ధమయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన రేసుగా పేరొందిన ఇది జీసీసీలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద క్లాసిక్ కార్ ర్యాలీగా గుర్తింపుపొందింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ జట్లు పాల్గొంటున్నాయి.
సోమవారం (డిసెంబర్ 5) క్రీక్ గోల్ఫ్ క్లబ్, 1,600 కిలోమీటర్ల మేర ఉన్న వ్రూమ్ నుండి ఈ ప్రాచిన సాహసయాత్ర ప్రారంభమైంది. బుర్జ్ ఖలీఫా, జెబెల్ జైస్, ఎమిరేట్ ప్యాలెస్‌తో సహా దేశంలోని అత్యంత ప్రసిద్ధ ల్యాండ్‌మార్క్‌ల మీదుగా ఇది సాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ రేసులో పాల్గొనే ఆరు ప్రత్యేకమైన కార్ల వివరాలు:
-1927 OM 665 "Superba": 1927లో ఇదే మోడల్ మొదటి 1000 మిగ్లియాను గెలుచుకున్నది. చారిత్రాత్మక విజయం తర్వాత ఈ వాహనం ఇటలీ అత్యంత ప్రసిద్ధ స్పోర్ట్స్ కార్లలో ఒకటిగా మారింది.
-1954 మెర్సిడెస్-బెంజ్ 300 SL గుల్‌వింగ్: 1950లలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారుగా గుర్తింపు పొందింది. గుల్‌వింగ్ గంటకు 260 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
-1958 ఫెరారీ 250 GT కాలిఫోర్నియా LWB స్పైడర్ : ఇప్పటివరకు తయారు చేయబడిన అరుదైన, అత్యంత విలువైన ఫెరారీలలో ఒకటి. కాలిఫోర్నియా LWB స్పైడర్ మిల్లే మిగ్లియా కోసం పోటీలో దిగనుంది.
-1958 Messerschmitt FMR TG500 రోడ్‌స్టర్: రేసులో ఉన్న అతి చిన్న, వైవిద్యమైన కారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే కూర్చోవచ్చు. టూ-స్ట్రోక్ స్ట్రెయిట్-టూ ఇంజన్ కలిగిన ఈ కారును 1958 నుండి 1961 వరకు మాత్రమే ఉత్పత్తి చేశారు.
-1964 లింకన్ కాంటినెంటల్ : 1964లో అప్పటి పోప్ తన పర్యటన కోసం భారతదేశానికి తీసుకువచ్చారు. ఆ వాహనాన్ని దాతృత్వం కోసం వేలం వేయడానికి మదర్ థెరిసాకు సమర్పించారు. ఈ కారు యజమాని భారతీయ పారిశ్రామికవేత్త యోహాన్ పూనావాలా.
-1977 లంబోర్ఘిని కౌంటాచ్ LP400' పెరిస్కోపో': లెజెండరీ కౌంటాచ్ సూపర్‌కార్ మొదటి వెర్షన్. ఈ ప్రత్యేకమైన కారు విశాలమైన చీలిక ఆకారపు బాడీవర్క్, కోణీయ గీతలు, పక్షి రెక్కలా తెరుచుకునే తలుపులకు ప్రసిద్ధి చెందింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర







