ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్
- December 06, 2022
దోహా: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీలు ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను పెంపొందించడానికి వారి సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఖతార్ పర్యటనలో ఉన్న యూఏఈ ప్రెసిడెంట్ దోహాలోని ఎమిరి దివాన్లో ఖతార్ ఎమిర్ తో జరిగిన అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఖతార్ ఎమిర్ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ ని స్వాగతించారు. అలాగే 51వ UAE జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ ప్రజలు షేక్ మొహమ్మద్ నాయకత్వంలో పురోగతి, శ్రేయస్సును కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ పర్యటన యూఏఈ -ఖతార్ సహకారాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణలో సహాయపడుతుందని ఎమిర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2022 FIFA ప్రపంచ కప్‌ను నిర్వహించడంలో విజయం సాధించినందుకు ఎమిర్ షేక్ తమీమ్, ఖతార్ ప్రజలకు యూఏఈ అధ్యక్షుడు తన అభినందనలను తెలియజేశారు. ఇది అన్ని గల్ఫ్ సహకార మండలి దేశాలకు, అరబ్ ప్రపంచానికి గర్వకారణంగా అభివర్ణించారు. ఈ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌ను నిర్వహించడంలో ఖతార్ సాధించిన విజయం GCC దేశాలు, అరబ్ ప్రపంచ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాధినేతలు తమ మధ్య ఉన్న అనేక సమస్యలను సమీక్షించారు. అలాగే తాజా ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







