డిసెంబర్ 21న తెలంగాణలో టీటీడీపీ భారీ బహిరంగ సభ
- December 06, 2022
తెలంగాణ: డిసెంబర్ 21న ఖమ్మంలో టీటీడీపీ భారీ బహిరంగ సభ ఏర్పటు చేయబోతుంది. దాదాపు ఐదు లక్షల మందితో ఈ సభ నిర్వహిచబోతున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా తెలంగాణ ఫై ఫోకస్ చేయని చంద్రబాబు..మళ్లీ ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో టీడీపీ అనేది లేనే లేదు. గతంలో ఉన్న నేతలంతా టిఆర్ఎస్ లో చేరిపోయారు. రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ లో చేరి , టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. ఈ క్రమంలో రీసెంట్ గా తెలంగాణ టీటీడీపీ పగ్గాలు కాసాని జ్ఞానేశ్వర్ కు అప్పగించారు చంద్రబాబు.
ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచుతుండగా.. పార్టీలు నేతల, దూకుడుతో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అయితే.. 2018 తరహాలోనే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారంతో విపక్ష పార్టీలు నిత్యం జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సైతం దృష్టి సారించారు. గతంలో వరద ప్రభావిత గ్రామాల పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉండడం తో ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో టీటీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు ప్రకటించాయి. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో 5లక్షల మందితో భారీ బహరింగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు టీటీడీపీ నేతలు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







