భారత్ లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- December 06, 2022
న్యూ ఢిల్లీ: భారత్ లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా ఉండడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.473 తగ్గి రూ.53,898కి చేరింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.54,371గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.1,241 తగ్గి, రూ.65,878గా కొనసాగుతోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర రూ.1,46,146 (USD 1,770.75)గా ఉంది. వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ సుదీర్ఘకాలం పాటు తగ్గించే అవకాశం లేకపోవడంతో పసిడి ధర తగ్గుతుందని నిపుణులు చెప్పారు. ఔన్సు వెండి ధర రూ.1,847గా ఉంది.
మరోవైపు డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రతిరోజూ పడిపోతూ వెళ్తుంది. ఇవాళ ఉదయం అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.91గా ఉంది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి 82.60కి పడిపోయింది. నిన్నటితో పోల్చితే 80 పైసలు పడిపోయింది. వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ అధికంగా కొనసాగిస్తుండడంతో దాని ప్రభావంతో మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







