నాగ్‌పూర్ మెట్రోకు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు..
- December 06, 2022
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రోకు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లైఓవర్ గల మెట్రోగా నాగ్‌పూర్ మెట్రో ఈ ఘనత దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో నిర్మాణాల్లో ఇంత పొడవులో రెండంతస్తుల ఫ్లైఓవర్ ఎక్కడా నిర్మించలేదు. దీని పొడవు 3.14 కిలోమీటర్లు ఉంటుంది (రోడ్డుపై రోడ్డు వంతెన ఉంటుంది. ఆ వంతెన పైన మెట్రో నిర్మాణం చేపట్టారు). నాగ్‌పూర్ మెట్రో పేరు మీదే గతంలో కూడా ఒక రికార్డు ఉంది. డబుల్ డక్కర్ పద్దతిలో అత్యధిక మెట్రో స్టేషన్లు నిర్మించి.. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నాగ్‌పూర్ మెట్రో చోటు సంపాదించుకుంది.
వార్దా రోడ్డులో నిర్మించిన డబుల్ డెక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంటుంది. కాగా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చిన ధ్రువ పత్రాన్ని నాగ్‌పూర్ మెట్రో భవన్లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ అందుకున్నారు. కాగా, తమకు ఈ అవార్డ్ లభించి తమ బాధ్యత మరింత పెంచిందని, వార్దా రోడ్డులో నిర్మాణం చేపట్టడం అతి పెద్ద సవాలని, దాన్ని తాము అధిగమించినందుకు ఆనందంగా ఉందని బ్రిజేష్ దీక్షిత్ అన్నారు.
ఇక నాగ్‌పూర్ మెట్రో గిన్నీస్ రికార్డు సాధించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హర్షం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర మెట్రోకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత జాతీయ రహదారుల సంస్థకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. పైన 3.14 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ వయడక్ట్ నిర్మాణం, అలాగే మెట్రో కింద జాతీయ రహదారి నిర్మాణం అద్భుతమని గడ్కరి అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







