తమన్నా.! తగ్గేదే లే.!
- December 06, 2022
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చాలా బిజీగా వుంది.ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా తమన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తమన్నా పనైపోయిందనుకున్న ప్రతిసారీ మరింత ఎనర్జీతో బౌన్స్ బ్యాక్ అవుతూ వస్తూనే వుంది.
ఈ ఏడాది పెద్ద ధియేటర్లో ‘ఎఫ్ 3’ సినిమాతో సందడి చేసిన తమన్నా, ఓటీటీలో ‘బబ్లీ బౌన్సర్’ అంటూ నెట్టింటి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.
ఇక, ఇప్పుడు ఆమె నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అప్పుడెప్పుడో రిలీజ్ కావల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. డిశంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో తమన్నా ఎనర్జిటిక్‌గా పాల్గొంటోంది.
కన్నడ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తమన్నా, సత్యదేవ్‌తో జోడీ కడుతోంది. కన్నడ ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన నాగ శేఖర్ ఈ సినిమాని తెరకెక్కించారు.
తెలుగులో నాగార్జున సూపర్ హిట్ క్లాసిక్ అయిన ‘గీతాంజలి’ సినిమాతో ఈ సినిమాని పోల్చుతుండడం విశేషం. నిజంగా ఈ సినిమా అంత గొప్ప ఎమోషనల్ టచ్ ఇస్తుందని తాజా ఇంటర్వ్యూలో తమన్నా చెప్పుకొచ్చింది.
మరోవైపు తమన్నా, వచ్చ ఏడాది ‘భోళాశంకర్’ సినిమాతో ప్రేక్షకుల్ని మరోసారి మెస్మరైజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







