‘హిట్ 3’ కోసం నాని బాగా పెంచేశాడుగా.!
- December 06, 2022
‘హిట్’ ది ఫస్ట్ కేస్ అంటూ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ఓ గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా టైటిల్‌కి యాప్ట్ అయ్యేలా హిట్టు కొట్టింది.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో స్టైలిష్ అండ్ డిఫరెంట్ మూవీగా రూపొందిన ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. కథ, కాన్సెప్ట్ నచ్చి నేచురల్ స్టార్ నాని ఈ సినిమాని తన సొంత బ్యానర్‌లో రూపొందించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో ఇది ఇక్కడితో ఆగిపోకూడదంటూ ప్రాంఛైజీల రూపంలో ఈ సినిమాలు వస్తూనే వుంటాయని నాని అప్పట్లోనే చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే రీసెంట్‌గా సెకండ్ ఫ్రాంచైజీ ‘హిట్ ది సెకండ్ కేస్’ అంటూ రిలీజ్ చేసి మళ్లీ సక్సెస్ అయ్యాడు.
ఈ సిరీస్‌లో నాని గెస్ట్ రోల్‌లో సందడి చేశాడు కూడా. ఇక, మూడో పార్ట్ కోసం నాని ప్లానింగ్ భారీగా చేస్తున్నట్లు తెలుస్తోంది. బాగా సోదిలో నిలిచిన ‘హిట్ ది సెకండ్ కేస్’ ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడంతో, మూడో పార్ట్‌ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు నాని.
ఆల్రెడీ స్టోరీ లైన్ సిద్ధంగా వున్న ఈ మూడో పార్ట్‌ని నాని మల్టీ స్టారర్‌గా రూపొందించే అవకాశాలున్నట్లు మాట్లడుకుంటున్నారు. అంతేకాదు, కాస్త బడ్జెట్ కూడా పెంచాలనుకుంటున్నాడట నాని.
ఈ సిరీస్‌లో నాని రోల్ కూడా పెంచబోతున్నాడట డైరెక్టర్ శైలేష్ కొలను. ఇప్పటికే ఇద్దరు హీరోలు విశ్వక్ సేన్, అడవి శేష్ ఎంగేజ్ అయ్యారు. మరో క్రేజీ హీరో కూడా ఈ పార్ట్‌లో యాడ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







