ప్రపంచ పర్యాటక వ్యయం: Dhs108 బిలియన్ తో దుబాయ్ అగ్రస్థానం
- December 07, 2022
దుబాయ్: వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (WTCC) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2022లో అంతర్జాతీయ పర్యాటక వ్యయం $29.4 బిలియన్లకు (Dhs108 బిలియన్) చేరుకోవడంతో దుబాయ్ ప్రపంచంలోనే ట్రావెల్, టూరిజంలో నంబర్ వన్ గమ్యస్థానంగా తన స్థానాన్ని నిలుపుకుంది. దోహా, లండన్లను అధిగమించిందని, పర్యాటకులు ఈ రెండు నగరాల్లో వరుసగా $16.8 బిలియన్లు, $16.1 బిలియన్లు వెచ్చించారని నివేదిక తెలిపింది.
"వీసా" కంపెనీ సహకారంతో విడుదల చేసిన నివేదిక.. ప్రపంచ పర్యాటక పరంగా నగరాలు శక్తి కేంద్రాలుగా కొనసాగుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రంగం, ఆర్థిక వ్యవస్థలలో పునరుద్ధరణకు దారితీస్తుందనే నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ సందర్శకుల వ్యయం పరంగా అత్యధిక పునరుద్ధరణను సాధించిన నగరాల్లో దోహా 21% టాప్ ఉన్నది. ఆ తర్వాత ఓర్లాండో 19%, అంటాల్య 15% పెరుగుదలతో ఉన్నాయి.
రాబోయే దశాబ్ద కాలంలో పర్యాటక రంగం మరోసారి ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందన్నారు. ఇది 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా 126 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని నివేదిక పేర్కొంది. 2019లో 6.6%, 2020లో 5.1% ఉన్న నగరాల నివేదికలో విశ్లేషించబడిన 82 నగరాల్లోని మొత్తం ఉద్యోగాలలో 8% వరకు ఈ రంగం నేరుగా అందిస్తుందని నివేదిక స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







