తప్పుదారి పట్టించే ప్రకటనలపై కఠిన చర్యలు: ఒమన్
- December 07, 2022
మస్కట్: తమ ఉత్పత్తులు వినియోగదారుల దృష్టిని ఆకర్షించాలని కంపెనీలు ప్రకటనల కోసం విపరీతంగా ఖర్చు పెడుతుంటాయి. కొంతమంది ప్రకటనలు చెప్పేవి అతిశయోక్తిగా ఉంటాయి. తప్పుదారి పట్టించే విధంగా ఆ ప్రకటనలు ఉంటాయి. ఇలా వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా ఉండే ప్రకటనలపై చర్యలు తీసుకుంటామని వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA)లోని కమర్షియల్ ఫ్రాడ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అల్ ఫదేల్ బిన్ నసీర్ అల్ యహ్మదీ హెచ్చరించారు. వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న లేదా కేవలం తప్పుడు ప్రచారం చేయడం చట్టవిరుద్ధమన్నారు. తప్పుదారి పట్టించే ప్రకటనలు వినియోగదారులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చుతాయన్నారు. ముఖ్యంగా ఆరోగ్య ఉత్పత్తుల కోసం ప్రకటనల విషయంలో ఇలా తప్పుడు ప్రకటనలు ఎక్కువ నష్టం చేస్తాయన్నారు. ఇటువంటి మోసపూరిత ప్రకటనలను ఎదుర్కోవడానికి, వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MOCIIP) ఇతర సంబంధిత విభాగాలతో సన్నిహిత సహకారంతో పని చేస్తోందని అల్ యహ్మదీ చెప్పారు. 2022 సంవత్సరంలో తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన దాదాపు 600 క్లెయిమ్స్, ఫిర్యాదులు అందాయని, 2021లో 610 ఫిర్యాదులు అందాయని తెలిపారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







