ఉపాధి ఒప్పందాలలో ఆటోమేటెడ్ సిస్టమ్: యూఏఈ
- December 07, 2022
యూఏఈ: మానవ ప్రమేయం లేకుండా ఉపాధి ఒప్పందాలను పూర్తి చేయడానికి మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ప్రారంభించింది. స్మార్ట్ సిస్టమ్ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ 2031కి అనుగుణంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు మోహ్రే పేర్కొంది. ఇది యూఏఈలోని కీలకమైన ప్రాంతాలలో అవలంబించాల్సిన సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం ద్వారా కృత్రిమ మేధస్సు (AI)లో UAEని గ్లోబల్ లీడర్‌గా సౌదీని నిలబెడుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త సిస్టమ్ ప్రారంభించిన మొదటి రెండు రోజుల్లో 35,000 కంటే ఎక్కువ ఒప్పందాలు పూర్తయ్యాయని, కొత్త, పునరుద్ధరించిన ఉపాధి ఒప్పందాలు, రెండు పార్టీల సంతకాల ధృవీకరణ తర్వాత ఆమోదం పొందాయని మోహ్రే చెప్పింది. కొత్త సిస్టమ్ ద్వారా ప్రాసెస్ కేవలం 30 నిమిషాలలో ముగుస్తుందన్నారు. గతంలో ఈ ప్రాసెస్ కు రెండు రోజుల సమయం పట్టేందన్నారు. అదే సమయంలో మానవ తప్పిదాలను కూడా తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబర్ 2017లో యూఏఈ కేబినెట్ ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం, లావాదేవీలను వేగవంతం చేయడం, వినూత్నమైన పని వాతావరణాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో యూఏఈ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఆమోదించిందని పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







