ఈ నెల 15న తెలంగాణ పర్యటనకు రానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
- December 07, 2022
హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 16వ తేదీకి బదులు ఈనెల15వ తేదీననే రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 15వ తేదీన కరీంనగర్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 న కరీంనగర్ లో పాదయాత్ర ముగింపు సభ నిర్వహించాల్సి ఉండగా నడ్డా షెడ్యూల్ వల్ల 16 కి కుదించారు. అయితే అదే రోజు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించాల్సి ఉండడంతో జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన.. బహిరంగ సభ షెడ్యూల ఈనెల 15 కు మారింది. దీంతో రెండు రోజుల ముందుగానే బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







