ఫిఫా ప్రపంచ కప్: క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తొలి అరబ్ దేశంగా నిలిచిన మొరాకో
- December 07, 2022
దోహా: మంగళవారం జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో స్పెయిన్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోవడంతో మొరాకో.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తొలి అరబ్ దేశంగా నిలిచింది. ప్రపంచ కప్ చరిత్రలో ఇంత దూరం వెళ్లిన నాల్గవ ఆఫ్రికన్ జట్టుగా కూడా అవతరించింది. రెండు గంటల పాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచులో 0-0 డ్రా తర్వాత షూటౌట్‌లో స్పెయిన్‌ను 3-0తో మొరాకో ఓడించింది. ఇదే ఊపు క్వార్టర్స్ లోనూ కొనసాగితే అరబ్ ప్రపంచం, ఆఫ్రికా నుండి మొట్టమొదటి సెమీ-ఫైనలిస్ట్‌లుగా మారే అవకాశం ఉంది. శనివారం దోహాలోని అల్ తుమామా స్టేడియంలో జరిగే క్వార్టర్‌ఫైనల్‌లో పోర్చుగల్ తో మొరాకో తన అధృష్టాన్ని పరిక్షించుకోనున్నది.
తాజా వార్తలు
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







